TG: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటగిరిలో రైస్ మిల్లు గోడ కూలి తండ్రీకూతురు మృతి చెందారు. మాలవాడకు చెందిన మహేశ్(25), అతని భార్య మహేశ్వరి, రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేశ్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్వరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.