AP: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని తన కొడుకుపై ఆగ్రహంతో తండ్రి బైక్‌ను తగలబెట్టారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి, కొడుకు కోరిక మేరకు ఏడాది కిందట బైక్ కొనిచ్చారు. అయితే కొడుకు స్నేహితులతో కలిసి నిబంధనలు ఉల
్లంఘిస్తూ వాహనం నడపడం, గతంలో లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి రావడం, తాజాగా ట్రిపుల్ రైడింగ్‌కు జరిమానా పడటంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బైక్ కొనివ్వడమే తన కొడుకు ఇలా మారడానికి కారణమని భావించి, వాహనాన్ని తగలబెట్టారు.