కూతురు పెళ్లి ఆగిపోయిందని.. తండ్రి ఆత్మహత్య

46084చూసినవారు
కూతురు పెళ్లి ఆగిపోయిందని.. తండ్రి ఆత్మహత్య
AP: విశాఖపట్నం పీఎంపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా కుమార్తె వివాహం రద్దు కావడంతో ర్యాలి శ్రీనివాసరావు (54) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 8 ఏళ్లుగా HYDలో కుటుంబంతో ఉంటూ పురుగుమందుల విక్రయ దుకాణంతో పాటు, నీటి శుద్ధి ప్లాంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 25న జరగాల్సిన తన కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. వైజాగ్ వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి, వాట్సాప్‌లో నాలుగు పేజీల సూసైడ్ నోట్ పంపి, బలవన్మరణానికి పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్