ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుండాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించవద్దని కుమారుడు మందలించినందుకు మనస్థాపానికి గురైన జంగు(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం విషయంపై కుమారుడు మందలించడంతో జంగు పురుగుల మందు తాగినట్లు ఎస్సై తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.