TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ (M) అమ్మాపురం గ్రామానికి చెందిన గుంషా వలి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తొర్రూరు CI గణేశ్ వివరాల ప్రకారం.. గుంషా వలి తాగుడుకు బానిస కావడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతడి భార్య తన నానమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడి నుంచి ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కుటుంబ కాలహాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.