AP: మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి అదే గ్రామానికి చెందిన మరొక వర్గానికి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆ అమ్మాయి చేసిన పనికి ఆ కుటుంబం తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో బతికున్న తన కూతురికి తమ ఆచారాల ప్రకారం తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు