ఒకేసారి టెన్త్ పాసైన తండ్రీకూతురు, తల్లీకొడుకులు

25చూసినవారు
AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో శిరీష అనే తల్లి తన చిన్న కుమారుడితో కలిసి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. ఆమెకు 365, కొడుక్కి 505 మార్కులు వచ్చాయి. పల్నాడు జిల్లాలో 42 ఏళ్ల బాబురావు, అతని కూతురు ఒకేసారి పదో తరగతి పాసయ్యారు. బాబురావుకు 257, కూతురికి 448 మార్కులు లభించాయి. కడప జిల్లాలో యశోద అనే మహిళ తన కూతురితో పాటు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ సంఘటనలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారాయి.