బ్రెయిన్ స్ట్రోక్‌తో తండ్రి మృతి.. ‘నాన్నా.. లే నాన్నా’ అంటూ..

33652చూసినవారు
బ్రెయిన్ స్ట్రోక్‌తో తండ్రి మృతి.. ‘నాన్నా.. లే నాన్నా’ అంటూ..
AP: కర్నూలు జిల్లా తుగ్గలిలో విషాదం చోటు చేసుకుంది. తుగ్గలి గ్రామానికి చెందిన వొరుగు రవి (36) బ్రెయిన్ స్ట్రోక్‌తో సోమవారం మరణించారు. రవి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య సుజాత, కుమారుడు జశ్వంత్, కుమార్తె ప్రత్యూష ఉన్నారు. కుటుంబం పెద్ద అకాల మరణంతో వారంతా రోదించారు. ‘నాన్నా.. లే నాన్నా. ఆటోలో బయటికి తీసుకెళ్తానన్నావు. లే నాన్నా వెళ్దాం’ అంటూ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్