
ప్రధాని కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పీఎంవో ప్రకటన ప్రకారం రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.2,880 కోట్లతో కర్నూలు–3 పూలింగ్ స్టేషన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, రూ.4,920 కోట్లతో ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు, పాపాఘ్ని వంతెన, రూ.960 కోట్ల గ్రీన్ఫీల్డ్ రహదారి, రూ.1,200 కోట్ల కొత్తవలస–విజయనగరం లేన్, గెయిల్ గ్యాస్ పైప్లైన్కు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభం చేయనున్నారు.




