AP: కోనసీమ(D) ఆలమూరు(M) చిలకలపాడులో పావులూరి కామరాజు తన కుమారులైన అభిరామ్ (11), త్రినాథ్ గౌతమ్ (8)లకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి తానూ చనిపోయిన విషయం తెలిసిందే. కామరాజు భార్య నాగలక్ష్మి అయిదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య చిన్నాన్న కొలుప్రోలు తలుపులు, ఆయన కుమారుడు శ్రీనివాస్, పావులూరి దుర్గారావు అనే వ్యక్తుల వేధింపులు భరించలేకే తాను బిడ్డలతో కలిసి లోకం విడిచిపెడుతున్నట్లు కామరాజు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.