
25 టన్నుల కల్తీ మసాలా స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో హెచ్-ఫాస్ట్ అధికారులు 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 3 క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కమ్ పౌడర్లు, ఇండస్ట్రియల్ కలర్స్, రైస్ బ్రాన్ అయిల్ వాడినట్లు గుర్తించారు. కల్తీ మసాలాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.




