ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఠకుర్‌ముండా సమితి మితువాని గ్రామానికి చెందిన గోపబంధు నాయక్(65) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తన కొడుకు శుభ్‌నాయక్ అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నాడు. మార్గమధ్యంలో కిందకి దిగిన శుభ్‌నాయక్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ అతడు కూడా మరణించాడు.