ఫాదర్స్ డే స్ఫూర్తి.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన నాన్న‌!

7533చూసినవారు
ఫాదర్స్ డే స్ఫూర్తి.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన నాన్న‌!
ఫాదర్స్ డే సందర్భంగా, కోల్‌కతాకు చెందిన సువేందు సర్కార్ ఒంటరి తండ్రుల త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్నారు. తల్లిని చిన్నతనంలోనే కోల్పోయి, తండ్రి బాధ్యతను నిరాకరించడంతో బంధువుల వద్ద పెరిగిన ఆయన, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. 2015లో వివాహం చేసుకుని, ఒక కుమారుడు, కుమార్తె జన్మించినా తర్వాత.. 2021లో భార్య మరణించడంతో ఆయన జీవితం మళ్ళీ విషాదంలో మునిగింది. అప్పుడు పిల్లల వయసు కేవలం ఒకటిన్నర, ఆరు నెలలు మాత్రమే. బంధువుల సలహాలను పక్కనపెట్టి, పిల్లల పెంపకాన్ని తానే స్వీకరించి, తల్లిలాగే సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలు ఆరు, ఐదేళ్లు. వారి ఆలనాపాలనలో ఏ లోటూ రాకుండా చూసుకుంటూ, వృత్తి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్