రైలు పట్టాలపై పడిపోయిన చిన్నారిని ఓ తండ్రి కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రమాదవశాత్తు ఓ చిన్నారి రైల్వే ట్రాక్ పై పడిపోగా, గమనించిన తండ్రి ఆ చిన్నారిని కాపాడుకునేందుకు పట్టాల పైకి చేరాడు. అంతలోనే ట్రైన్ రావడంతో చిన్నారితో సహా పట్టాలపై పడుకుని చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాక, తన ప్రాణాలు దక్కించుకున్నాడు. ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకోగా అతడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.