కూతురు ప్రేమ వివాహం నచ్చక... యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన తండ్రి

14చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడ గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కూతురు.. అదే గ్రామానికి చెందిన బోయిని నగేశ్ ను కొద్దిరోజుల కింద ప్రేమ పెండ్లి చేసుకుంది. ఈ ప్రేమ వివాహం నచ్చని యువతి తండ్రి విఠల్, కుమారుడు పాండుతో కలిసి నగేష్ తండ్రి పై ఇద్దరూ కలిసి విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్