ఫ్యాటీ లివర్ (హెపాటిక్ స్టియాటోసిస్) అనే వ్యాధి చాలామందిని బాధిస్తోంది. ఇది ప్రారంభంలో లక్షణాలు లేకపోయినా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరసం, పొట్ట అసౌకర్యం, ఛాతి కింద నొప్పి, బరువు పెరుగుదల, ఆకలి తగ్గడం, కామెర్లు, వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మద్యం, జంక్ ఫుడ్, స్థూలకాయం, డయాబెటిస్ దీనికి కారణాలు. తాజా పండ్లు, ఆకుకూరలు, బీట్‌రూట్, ఓట్స్, ఆలివ్ ఆయిల్, నట్స్, చేపలు, పసుపు వంటివి లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.