బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడా తగ్గిపోతోంది. అమితాబ్ బచ్చన్ 'కల్కి 2898 AD'లో అశ్వథ్థామగా మెప్పించగా, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాలో అభిషేక్ కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.