యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వినియోగదారులకు గురువారం ఓ హెచ్చరిక జారీ చేసింది. 19 రకాల వంట పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోకి సీసం (లెడ్) చేరే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ వంట పాత్రల్లో చాలా వరకు భారతదేశంలో తయారయ్యేవేనని, వీటిని అల్యూమినియం, అల్లాయ్స్‌తో తయారు చేస్తారని ఎఫ్‌డీఏ పేర్కొంది. భారత్‌లోని వివిధ కంపెనీలు తయారు చేసి, ఎగుమతి చేస్తున్న అల్యూమినియం కుక్‌వేర్‌పై ఎఫ్‌డీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది.