పెట్రోల్ కొరత భయం.. బంకుల వద్ద క్యాన్లతో భారీగా క్యూలు

6చూసినవారు
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులతో వాహనదారుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రజలు క్యాన్లతో క్యూ కట్టారు. 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తాయేమోనన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వదంతులు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. అనవసర భయాందోళనలకు గురికావద్దని వాహనదారులకు సూచించారు.