మాజీ ఎమ్మెల్యేను కొట్టిన మహిళా కౌన్సిలర్ (వీడియో)

42చూసినవారు
యూపీలోని అమ్రోహా జిల్లా గజ్రౌలా మున్సిపల్ కౌన్సిల్ బోర్డు సమావేశంలో ఇటీవల ఘర్షణ జరిగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ రాజేంద్రి అలియాస్ ఉమా దేవికి వ్యతిరేకంగా కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. వారి ప్రతిపాదలను వ్యతిరేకించిన ఉమాదేవి అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్‌తో సహా బయటకు వెళ్లబోయారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్‌ను కాలర్ పట్టుకుని, ఆయనపై ఓ మహిళా కౌన్సిలర్ దాడి చేశారు.

సంబంధిత పోస్ట్