భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. నవంబర్ 2న వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యురాలైన అరుంధతి, బుధవారం ప్రధాని మోడీని కలిసినప్పుడు తన తల్లి పంపిన సందేశాన్ని ఆయనకు తెలియజేశారు. 'మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. మా అమ్మ మీకు పంపిన ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆమెకు మీరు హీరో అట' అని అరుంధతి ప్రధానితో అన్నారు. దీనికి ప్రధాని మోడీ చిరునవ్వుతో స్పందించారు.