ఫ్రెండ్ ఇంట్లో చోరీ చేసిన మ‌హిళా డీఎస్పీ (వీడియో)

32చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని బోపాల్‌లో మహిళా డీఎస్పీ కల్పనా రఘువంశీ తన స్నేహితురాలి ఇంట్లో నుంచి రెండు లక్షల నగదు, మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్నానానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డీఎస్పీ పరారీలో ఉండగా, పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసినట్లు ఏఎస్పీ బిట్టు శర్మ తెలిపారు, అయితే నగదు ఆచూకీ లభించలేదు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఆమెకు నోటీసులు జారీ చేసి, క్రమశిక్షణా చర్యలు తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్