AP: కడపలోని మున్సిపల్ హైస్కూల్‌లో ఇన్‌ఛార్జ్ హెచ్ఎంగా పని చేస్తున్న జింకా జమీనా సుందరం (49) ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జింకా జమీమా సుందరం, ఆమె భర్త పుష్పరాజు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇటీవల ఇన్‌ఛార్జ్ హెచ్ఎంగా జమీనా నియమితులయ్యారు. అయితే ఆమెకు మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. దాంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. స్థానికులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. జమీమా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.