ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. కేసీఆర్‌ను ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నందినగర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.