బ్రిటన్‌లో ఒక భారతీయ మహిళా ఉబెర్ డ్రైవర్, డబ్బులు చెల్లించినా టిప్ ఇవ్వాలని ప్రయాణికురాలిని బలవంతం చేసి, ఆమె ఒప్పుకోకపోవడంతో కారు డోర్లు లాక్ చేసి బంధించింది. గతేడాది జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూకే నిబంధనల ప్రకారం టిప్ ఇవ్వడం తప్పనిసరి కాదని, ప్రయాణికులను బంధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనపై డ్రైవర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియరాలేదు.