TG: గురుకుల విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్(M) జడ్చర్ల(M) కేంద్రంలోని ఓ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి లైంగిక దాడి చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను విచారించి వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజిని రాగమాలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.