రైతులకు త్వరలో బిగ్ షాక్ తగలవచ్చని తెలుస్తోంది. వానాకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన నేపథ్యంలో, ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులను నిలిపివేయడం రబీ సీజన్‌లో సమస్యలను పెంచనుంది. భారతదేశం యూరియా, డీఏపీ వంటి ఎరువులను దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఆంక్షల కారణంగా ఎరువుల ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగితే, రైతులకు అదనపు భారం తప్పదు.