
శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న ప్రధాని మోదీ
AP: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. గతంలో ప్రధాని హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు. భారత వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉ.9.55 గంటలకు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు.




