ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు: 11 మంది మృతి, చారిత్రక కట్టడం ధ్వంసం

12128చూసినవారు
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు: 11 మంది మృతి, చారిత్రక కట్టడం ధ్వంసం
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణి, డ్రోన్‌ దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో 11వ శతాబ్దానికి చెందిన చారిత్రక డార్మిషన్‌ కేథడ్రల్‌ భారీగా దెబ్బతింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధాన్ని కొనసాగించాలన్న రష్యా ఉద్దేశాన్ని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని, జీ-7 దేశాలు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని కోరారు. ఈ దాడుల అనంతరం జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్‌, రష్యా వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్