మరో రెండు వారాల్లో ఫుట్‌బాల్ సంగ్రామం మొదలు కానుంది. భారత అభిమానులు ఈ మ్యాచ్‌లను ఎక్కడ వీక్షించాలో ఇంకా స్పష్టత రాలేదు. హాట్‌స్టార్ ప్రసార హక్కులకు ఆసక్తి చూపకపోవడంతో, జీ సంస్థ రేసులోకి వచ్చింది. జీ సంస్థతో ఫిఫా డీల్‌కు సిద్ధమైందని, దీని విలువ 30-35 మిలియన్ డాలర్లు ఉండొచ్చని సమాచారం. సోనీ పిక్చర్స్ కూడా ఆసక్తి చూపినా, బిడ్ దాఖలు చేయలేదు. జీ నెట్‌వర్క్‌తో ఒప్పందం కుదిరితే, భారత అభిమానులు బహుళ భాషల్లో లైవ్ కవరేజీని జీ5లో వీక్షించవచ్చు.