కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవి కోసం ఫైట్..!

32చూసినవారు
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవి కోసం ఫైట్..!
TG: రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. గతంలో సీనియర్లు పోటీ పడేవారు, కానీ ఈసారి యువ నాయకులు ఎక్కువగా రేసులోకి వస్తున్నారు. మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కోసం హర్ష వర్ధన్ రెడ్డి, మన్నే జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, శివసేనా రెడ్డి, శివ చరణ్ రెడ్డి, గౌరీ సతీష్ వంటి ఆశావహులు ఉన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, చనగాని దయాకర్, సింగాపురం ఇందిర పేర్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్