సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్రాంకీ లాపెన్నా రోబోట్‌తో ఫైట్ చేశారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ వినూత్నమైన పోటీలో ఆరు అడుగుల ఎత్తు, టెర్మినేటర్ సినిమాలోని విలన్ రూపంలో ఉన్న రోబోట్‌తో రింగ్‌లో తలపడ్డారు. రోబోట్‌పై లాపెన్నా కొన్ని పంచ్‌లు కొట్టగా.. అది కూడా కిక్కులు, పంచ్‌లతో ఎదురుదాడి చేసింది. రోబోట్ కొట్టిన రెండు పంచ్‌లకు లాపెన్నా గాల్లో ఎగిరిపడ్డాడు. అయితే రోబో సొంతంగా పోరాడలేదు, రిమోట్ ద్వారా ఓ వ్యక్తి దాన్ని ఆపరేట్ చేశాడు.