చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తితో దాడి చేసిన యువకుడు

55చూసినవారు
చికెన్ కోసం గొడవ.. ముగ్గురిపై కత్తితో దాడి చేసిన యువకుడు
AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో చికెన్ షాపు వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తనకు ముందు చికెన్ కావాలనే వాగ్వాదం నరేష్ అనే యువకుడిని రెచ్చగొట్టింది. దీంతో అతను కత్తితో విజయ్, చిన్న, గాబ్రేలు అనే వారిపై దాడి చేశాడు. గాయపడిన వారిలో విజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you