
టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు.. అంతలోనే ఊహించని ట్విస్ట్ (వీడియో)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, టీ తాగడానికి స్టేషన్లో దిగాడు. అయితే, రైలు ఆటోమేటిక్‌గా డోర్లు మూసుకుని బయలుదేరడంతో అతను ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోయాడు. చేతిలో టీ కప్పులతో రైలు ఎక్కడానికి ప్రయత్నించినా, డోర్లు మూసుకుపోవడంతో విఫలమయ్యాడు. చివరికి టీ కప్పులను పడేసి, రైలును వెంబడించాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




