జానీ మాస్టర్‌కు సహాయం చేయడానికి నిరాకరించిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌

48చూసినవారు
జానీ మాస్టర్‌కు సహాయం చేయడానికి నిరాకరించిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌
TG: హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ జానీ మాస్టర్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్‌కు సహాయం చేయడానికి నిరాకరించింది. అలాగే దేశవ్యాప్తంగా జానీ మాస్టర్‌ పాల్గొనే ఏ సినిమా చిత్రీకరణలోనూ మిగిలిన 23 క్రాఫ్ట్‌లకు చెందిన సభ్యులు పనిచేయరని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేయనున్నట్లు వెల్లడించింది. భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై ఫెడరేషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జానీ మాస్టర్‌కు వివరణ ఇవ్వాలని గడువు విధించిన ఫెడరేషన్‌, నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్