
ట్రంప్‌కు ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. అనవసరమైన, భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు.




