TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన నిర్మాత, నటుడు దుష్యంత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. దుష్యంత్ రెడ్డి అలియాస్ రిషి బుధవారం ఉదయం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దర్శకుడు శశి ప్రీతం దర్శకత్వం వహిస్తున్న ఎక్స్ రోడ్స్ సినిమాతో సహ నిర్మాతగా, నటుడిగా ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈయనకు షాద్ నగర్ పట్టణంలో పలు వ్యాపారాలు ఉన్నాయి. నందిగామ మండలం చంద్రాయనగూడ గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రంలో దుష్యంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.