మే 2న తమిళనాడులో సినిమా షూటింగ్‌ బంద్‌

9చూసినవారు
మే 2న తమిళనాడులో సినిమా షూటింగ్‌ బంద్‌
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 2వ తేదీన తమిళనాడులో సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇకపై నటీనటులకు రెమ్యునరేషన్‌ ఇవ్వకూడదని, బదులుగా సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని ప్రతిపాదించారు. టాలీవుడ్‌ తరహాలో కోలీవుడ్‌లోనూ సినిమా నిర్మాణ పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని మండలి నిర్ణయించింది. ఈ నిర్ణయాలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్