డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమాల రిలీజ్‌కు అనుమతివ్వాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే

16చూసినవారు
డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమాల రిలీజ్‌కు అనుమతివ్వాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే
TG: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాను సారా గురించి ఆరోగ్య పరమైన అంశాలను ప్రస్తావించినపుడు ట్రోలింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సారాను ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్ తాగుతున్నట్లు నటిస్తే మాత్రం జనాలు ఈలలు కేకలు వేశారని అన్నారు. అందుకే సినీ నటులకు ముందుగా డ్రగ్స్ టెస్ట్ చేయించాలని, ఆ తర్వాతే సినిమాల విడుదలకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోని యాక్టర్లు, మత్తు మందు వాడినట్లేనని సంచలన వ్యాఖ్యాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్