TG: వీబీజీ రామ్‌జీ పథకంపై కేంద్రానికి అభ్యంతరాలు తెలిపినట్లు మంత్రి సీతక్క చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'పాత విధానమే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. జూలై 2న జరగనున్న తెలంగాణ కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ పథకం కొనసాగించాలా లేదా? కొత్త పథకం ప్రవేశపెట్టాలా? అనే ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే వికసిత్ గ్రామాలు-2047 లక్ష్యం సాధ్యం' అని అన్నారు.