మరికాసేపట్లో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు, గుజరాత్ మధ్య ఐపీఎల్ ఫైనల్స్ ప్రారంభం కానుంది. అయితే, మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల వరకు కూడా వర్షం పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వర్షం భారీగా పడితే రిజర్వ్ డే ఉంటుంది. సూపర్ ఓవర్ అవకాశం లేకపోతే సోమవారం మ్యాచ్ జరుగుతుంది. రేపు కూడా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే, పాయింట్స్ టేబుల్ ప్రకారం బెంగళూరును విజేతగా ప్రకటిస్తారు.