TG: సొంతిల్లు లేనివారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. జనగామ జిల్లాలో శనివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.