ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఆర్థిక సాయం

56చూసినవారు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఆర్థిక సాయం
TG: ఎక్సైజ్‌ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఎక్సైజ్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు. నిజామాబాద్‌లో జనవరి 23న గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి, తొక్కించేయడంతో సౌమ్య చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు.