దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. E20 పెట్రోల్ నిర్వహణ సవాళ్లు, UPI లావాదేవీలపై MDR ఛార్జీల ప్రతిపాదన, గత 9 ఏళ్లుగా లీటరుకు కేవలం 30 పైసలు మాత్రమే పెరిగిన కమిషన్లు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, విపరీతంగా పెరిగిన కొత్త అవుట్లెట్ల విస్తరణతో అమ్మకాలు పడిపోవడం వంటి సమస్యలు వారిని కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యాపారాలను రక్షించడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.