
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా (వీడియో)
AP: ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో గోదావరి, కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,21,847 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




