అమెరికాలోని అల్బనీలో డిసెంబర్ 4న జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ అనే తెలుగు యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన సహజారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం తెలుగు విద్యార్థులు నివాసముంటున్న పక్క భవనానికి వ్యాపించడంతో విషాదం చోటుచేసుకుంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.