ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురంలో గౌర్ గ్రీన్ అవెన్యూ సొసైటీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. 9, 10వ అంతస్తుల్లో మొదలైన మంటలు 8-10 ఫ్లాట్లకు వ్యాపించాయి. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే నుండి కూడా మంటలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.