ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు వెళ్తున్న ఓ సరుకు రవాణా రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఓ బోగీ పూర్తిగా దగ్ధమైంది. బోగీలో ఉన్న కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తమైన రైలు నుంచి బోగీని వేరు చేశారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.