ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మూడవ టెర్మినల్‌లో ఓ విమానం దగ్గర నిలిపి ఉంచిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.