TG: అగ్నిప్రమాదంలో రూ.20 లక్షల నగదు, 4 తులాల బంగారం దగ్ధమైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బండివాడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బండి అంజప్ప ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి ఇంట్లో దాచుకున్న రూ.20 లక్షల నగదుతో పాటు 4 తులాల బంగారం అగ్నికి ఆహుతయ్యింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.